రంగస్థలం తమిళ రీమేక్ లో లారెన్స్

Published on Nov 01,2019 04:46 PM

రాంచరణ్ తేజ్ నటించిన రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. చరణ్ కెరీర్ లోనే గొప్ప హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాత , హీరో అయిన రాఘవ లారెన్స్. తమిళ రీమేక్ రైట్స్ కోసం ఏకంగా ఒక కోటి 50 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకోవడమే కాకుండా ఆ మొత్తాన్ని ఇచ్చాడట లారెన్స్.

చరణ్ పోషించిన చెవిటి వాడి పాత్రలో లారెన్స్ నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడట ! అలాగే ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తాడా ? లేక లింగుస్వామి కి ఛాన్స్ ఇస్తాడా చూడాలి. హర్రర్ చిత్రాలతో బాగా సొమ్ము చేసుకుంటున్న లారెన్స్ కు వెరైటీ గా గ్రామీణ నేపథ్యమున్న రంగస్థలం చిత్రం బాగా నచ్చిందట అందుకే రీమేక్ రైట్స్ కొన్నాడు.