వెంకటేష్ , చైతూ ల సినిమాలో రానా కూడా

Published on Jan 30,2019 05:43 PM

టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ ల చిత్రాలు ఊపందుకున్నాయి . గత కొంత కాలంగా మల్టీస్టారర్ చిత్రాలు సందడి చేస్తున్నాయి టాలీవుడ్ లో . తాజాగా సీనియర్ హీరో వెంకటేష్ , అక్కినేని నాగచైతన్య ల కాంబినేషన్ లో '' వెంకీ మామ '' అనే సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే . ఫిబ్రవరి 21 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం లో వెంకటేష్ , నాగచైతన్య లతో పాటుగా రానా కూడా నటించనున్నట్లు తెలుస్తోంది . 

అయితే రానా నటిస్తున్నాడు కానీ కేవలం గెస్ట్ పాత్రలో మాత్రమే నటించనున్నాడట రానా . పవర్ , జై లవకుశ , సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . ఇటీవలే ఎఫ్ 2 తో సంచలన విజయం సాధించాడు వెంకటేష్ . మరి ఈ వెంకీ మామ తో ఎలాంటి విజయాన్ని సాధించనున్నాడో ! అన్నట్లు వెంకటేష్ - నాగచైతన్య లు మేనమామ - మేనల్లుడు అన్న విషయం తెలిసిందే .