పెళ్లి వార్తలను ఖండించిన హీరోయిన్

Published on Dec 19,2019 11:54 AM

తనకు పెళ్లి అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుండటంతో ఆ వార్తలను ఖండించింది మలయాళ భామ రమ్యా నంబీశన్. ఈ భామకు పెళ్లి అయ్యిందని వార్తలు రావడానికి కారణం ఏంటో తెలుసా ....... చీరలో రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో వచ్చేలా చేయడమే ! చీరలో ఉన్న రమ్యా నంబీశన్ ఫోటోలను చూసి పెళ్లి అయ్యిందని ఫిక్స్ అయిన కొంతమంది ఈ భామకు పెళ్లి అయ్యిందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం రమ్యా చెవిన పడటంతో ఎట్టకేలకు స్పందించింది.

నాకు పెళ్లి కాలేదు , ఇక పొతే ఈ చీరలో దిగిన ఫోటోలు కేవలం సినిమా కోసమే ! బద్రి వెంకటేష్ దర్శకత్వంలో నటించే సినిమా కోసం పట్టుచీరలో ఫోటోలు దిగాను అయితే అవి పెళ్లి కావడంతో దిగింది అని భ్రమపడ్డారు అంతేకాని నాకు పెళ్లి కాలేదు అని అంటోంది రమ్యా నంబీశన్. 33 ఏళ్ల రమ్యా నంబీశన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది. ఇక ఇప్పుడేమో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటిస్తోంది. నా పెళ్లి అయితే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అని అంటోంది రమ్యా నంబీశన్.