ట్రెండింగ్ లో రాములో రాముల సాంగ్

Published on Nov 01,2019 04:01 PM

అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం '' అల ..... వైకుంఠపురములో ''. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలోని '' రాములో రాముల '' అనే పాత్ర యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. నెంబర్ 3 లో ట్రెండ్ అవుతోంది రాములో రాముల పాట. మొదట ఈ చిత్రంలోని '' సామజవరగమనా '' అనే పాట విడుదల చేయగా అది కూడా సంచలనం సృష్టించింది.

అయితే ఆ పాట క్లాసికల్ సాంగ్ కాగా ఇప్పుడు విడుదల చేసిన రాములో రాముల అనే పాట మాస్ సాంగ్ . ఫాస్ట్ బీట్ తో యూత్ ని బాగా అలరిస్తోంది ఈ పాట దాంతో రికార్డులు బద్దలు అవుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే 50 మిలియన్ లు ఏం ఖర్మ 80 మిలియన్ వ్యూస్ దాటినా ఆశ్చర్యం లేదు అంతగా ఆకట్టుకుంటోంది రాములో రాముల పాట. ఇక ఈ చిత్రాన్ని 2020 జనవరి 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.