కరోనా బాధితుల కోసం రామోజీరావు 20 కోట్ల విరాళం

Published on Apr 02,2020 03:39 PM
కరోనా బాధితులను ఆదుకోవడానికి మీడియా దిగ్గజం రామోజీరావు 20 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణకు 10 కోట్లు అలాగే ఆంధ్రప్రదేశ్ కు 10 కోట్ల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని ఆర్ టి జి ఎస్ చేసారు రామోజీరావు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈనాడు గ్రూప్ సంస్థలకు విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కరోనా తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

రెండు రాష్ట్రాలలో కూడా కరోనా బాధితులు రోజురోజుకి ఎక్కువ అవుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొత్త పాజిటివ్ కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక రామోజీరావు విషయానికి వస్తే ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత మాత్రమే కాకుండా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను కూడా నిర్మించాడు.