బంపర్ ఆఫర్ ఇస్తున్న రాంగోపాల్ వర్మ

Published on Apr 15,2020 05:16 PM
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ ఓ యువతికి బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు ట్వీట్ చేసాడు. నీకు కనుక సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉంటే వెంటనే నేనిచ్చే మెయిల్ కు వివరాలు పంపగలవు అంటూ ఆ యువతి టిక్ టాక్ లో చేసిన వీడియోని కూడా జతచేసి పంపాడు. టిక్ టాక్ లో పలువురు యువతీ యువకులు తమ టాలెంట్ కు పదును పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక టిక్ టాక్ ద్వారా చాలామందే ఫేమస్ అవుతున్నారు.

రాంగోపాల్ వర్మ ఇప్పటికే బోలెడు మందిని సినిమారంగానికి పరిచయం చేసాడు. అలాగే పలువురికి బ్రేక్ ఇచ్చాడు. అయితే ఇటీవల కాలంలో వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏవి కూడా ఆడటం లేదు కానీ వాటికీ మాత్రం ఎలాగో అలా తనదైన టెక్నీక్ తో మీడియాలో నానేలా చేస్తున్నాడు. ఇక ఈ యువతి ఎవరో కానీ వర్మ కళ్ళలో పడింది. సినిమాలు అంటే ఇష్టం ఉంటే తప్పకుండా ఛాన్స్ ఇవ్వనున్నాడు వర్మ.