మరో వివాదాస్పద బయోపిక్ టేకప్ చేసిన వర్మ

Published on Apr 01,2019 11:20 AM

దర్శకులు రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే . ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో ప్రకంపనలు సృష్టించిన వర్మ తాజాగా శశికళ అనే మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టాడు . దివంగత ముఖ్యమంత్రి జయలలితకి చెల్లి అయిన శశికళ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి . అంతేకాదు ప్రస్తుతం జైలు జీవితం గడుపుతోంది కూడా. జయలలిత కు శశికళ సన్నిహితురాలు మాత్రమే కాకుండా ఆ ఇద్దరి అనుబంధం గురించి రకరకాల పుకార్లు ఉన్నాయి అలాగే జయలలిత మరణం కూడా అత్యంత వివాదాస్పదం అయ్యింది దాంతో మన్నార్ గుడి మాఫియా అంటూ ప్రచారం సాగింది . అయితే ఇలా అన్ని వివాదాస్పద అంశాలను టచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు వర్మ . ఇప్పటికే జయలలిత బయోపిక్ అంటూ రెండు చిత్రాలు వస్తున్నాయి. అయితే ఇది వాటికి భిన్నమైన సినిమా అవుతుంది.