లక్ష్మీస్ ఎన్టీఆర్ బాలకృష్ణకు అంకితమట

Published on Mar 11,2019 05:10 PM

లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీయాలనే  ఆలోచన నాకు కలిగేలా చేసిన నందమూరి బాలకృష్ణ కు నా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంకితం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . నిన్న రాత్రి పార్క్ హయత్ హోటల్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . కాగా ఆ వేడుకలో పాల్గొన్న రాంగోపాల్ వర్మ ఈ సినిమా బాలకృష్ణకు అంకితం అంటూ బాంబ్ పేల్చాడు . 

ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని అనుకున్న సమయంలో బాలయ్య ని కలిశాడట వర్మ , అయితే బాలయ్య చెప్పిన విషయంతో వర్మ విబేధించాడట . లక్ష్మీపార్వతి ప్రస్తావన లేకుండా బయోపిక్ ఏంటి ? అని వచ్చేసాడట వర్మ . ఆ తర్వాతే లక్ష్మీపార్వతి కోణంలో సినిమా తీయాలని డిసైడ్ అయి ఈ సినిమాని రూపొందించాడట వర్మ . ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి అదే సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈనెల 22 న లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కానుంది .