ఎన్టీఆర్ కథానాయకుడు వర్మకు నచ్చలేదట

Published on Jan 22,2019 11:57 AM

నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నాకు ఎక్కడా ఎన్టీఆర్ కనిపించలేదని , బాలయ్య ఎన్టీఆర్ కొడుకు కాబట్టి అతడికి కొన్ని పోలికలు వచ్చాయి కానీ ఎన్టీఆర్ కథనాయకుడు లో ఎన్టీఆర్ కనిపించలేదు అంటూ బాంబ్ పేల్చాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . అయినా నేను ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని చూడలేదు కేవలం ట్రైలర్ ని మాత్రమే చూసాను అంటూ అసలు విషయాన్నీ చెప్పాడు . 

అంతేకాదు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ లేడు కానీ నా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో మాత్రం ఎన్టీఆర్ కనిపిస్తాడని అలాగే అసలైన నిజాలు నా సినిమాలో మాత్రమే ఉంటాయని మరో బాంబ్ పేల్చాడు వర్మ . తాజాగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తీస్తున్న విషయం తెలిసిందే . ఇక ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్లాప్ అయ్యింది దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ పై అంచనాలు పెరుగుతున్నాయి .