ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసిన వర్మ

Published on Apr 03,2019 04:32 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ . తెలుగుదేశం పార్టీకి వారసుడు నారా లోకేష్ కాదని ముమ్మాటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అంటూ ట్వీట్ చేసాడు రాంగోపాల్ వర్మ . అంతేకాదు చంద్రబాబు కి ఓటేసే ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఓసారి చూడాలని , అప్పుడు ఓటు వేయాలని ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కోరాడు వర్మ . 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ కాగా ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ తో మరింతగా డ్యామేజ్ చేసాడు వర్మ. ఇక ఈనెల 11న ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశానికి కాబోయే లీడర్ అంటూ ట్వీట్ చేసి తెలుగు తమ్ముళ్ళని మరింతగా రెచ్చగొట్టాడు వర్మ .