మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్న రాంచరణ్

Published on Feb 01,2020 07:22 PM

మెగాపవర్ స్టార్ రాంచరణ్ మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ ని కలవరపెట్టే వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే సాహో వంటి డిజాస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుజీత్ దర్శకత్వంలో రాంచరణ్ నటించనున్నాడు అని. రన్ రాజా రన్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్ కొట్టిన సుజీత్ కు సాహో వంటి పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్. అయితే ఆ బంగారం లాంటి ఛాన్స్ ని సుజీత్ ఉపయోగించుకోలేకపోయాడు.

అలాంటి దర్శకుడితో చరణ్ సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కు కలవరమే కదా ! ప్లాప్ దర్శకుడితో సినిమా చేయడం ఏంటి ? అని మెగా ఫ్యాన్స్ షాక్ అవ్వడం ఖాయం. అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది ఇంకా చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా అయ్యాక కానీ ఈ ప్రాజెక్ట్ సంగతి తేలదు. సుజీత్ తో తమ తదుపరి సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ సిద్ధంగా ఉందట. అయితే చరణ్ ఒప్పుకోవాలి మరి.