ఫ్యాన్స్ కు సారీ చెప్పిన రాంచరణ్

Published on Feb 05,2019 03:50 PM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ మెగా అభిమానులకు సారీ చెప్పాడు . బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం ఘోర పరాజయం పొందడమే కాకుండా అటు అభిమానులను ఇటు బయ్యర్లను నష్టాల్లో ముంచింది దాంతో మెగా అభిమానులు బోయపాటి పై అలాగే ఇలాంటి కథ ని ఎలా ఎంచుకున్నాడని చరణ్ పై కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసారు . 

అయితే ఇన్ని రోజులు దాని గురించి పెద్దగా స్పందించని చరణ్ తాజాగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు . ఎన్నో ఆశలు పెట్టుకొని , కస్టపడి పని చేశామని కానీ మీ అంచనాలను అందుకోలేక పోయామని , తదుపరి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తానని కోరాడు చరణ్ . జనవరి 11 న విడుదలైన వినయ విధేయ రామ బయ్యర్లకి నట్టేట ముంచింది . బయ్యర్లు ఆర్ధికంగా నష్టపోయారు అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ డిజాస్టర్ ని తట్టుకోలేకపోయారు అందుకే వాళ్ళని శాంతపరచడానికి ఈ లెటర్ రిలీజ్ చేసాడు చరణ్ .