కోర్టు బోనులో రాంచరణ్ !

Published on Nov 13,2019 05:48 PM

కోర్టు బోను ఎక్కనున్నాడు రాంచరణ్ . అదేంటి రాంచరణ్ కోర్టు బోను ఎక్కడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం కోర్టు మెట్లు ఎక్కనున్నాడు చరణ్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం '' ఆర్ ఆర్ ఆర్ ''. చరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది.

బ్రిటీష్ వాళ్ళని ఎదురించే క్రమంలో వచ్చే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది రామోజీ ఫిలిం సిటీలో. చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు. చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ , ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జులై లో భారీ వర్షాల మధ్య విడుదల కానుంది.