చరణ్ కు గాయాలు : ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ బంద్

Published on Apr 04,2019 10:27 AM

ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ అర్దాంతరంగా ఆగిపోయింది . రాంచరణ్ కాలికి గాయం కావడంతో చేసేది లేక షూటింగ్ ని మూడు వారాల పాటు వాయిదావేశాడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి . ప్రస్తుతం పూణే లో ఆర్ ఆర్ ఆర్ మూడో షెడ్యూల్ జరుగుతోంది , ఆ సమయంలో జిమ్ లో వ్యాయామం చేస్తున్న చరణ్ అదుపుతప్పడంతో కాలిమడమ దగ్గర గాయం అయ్యింది . 

కాలికి గాయం కావడంతో షూటింగ్ లో పాల్గొనడం కష్టం కాబట్టి మూడు వారాల పాటు గ్యాప్ ఇచ్చాడు జక్కన్న . షూటింగ్ కి పేకప్ చెప్పడంతో పూణే నుండి చిత్ర బృందం హైదరాబాద్ కు రానుంది . చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ నటించనుంది . చరణ్ ఇక మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోనున్నాడు కాలి గాయంతో .