రెండుగంటల పాటు ఎంటర్టైన్ చేసే "రామచక్కని సీత"

Published on Sep 27,2019 09:45 AM
ఇంద్ర, సుకృత జంటగా శ్రీహర్ష దర్శకత్వం లో ఫణి నిర్మాత గా వ్యవహరిస్తున్న చిత్రం "రామచక్కని సీత". అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని 27న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఆ కార్యక్రమంలో నిర్మాత ఫణి మాట్లాడుతూ... సినిమా చాలా కష్టపడి చేసాము.. ఆర్టిస్టులు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. చాలా కంట్రోల్ గా బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేశాడు దర్శకుడు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను  27న బ్రహ్మాఢంగా భారీగా  విడుదల చేస్తున్నాము అన్నారు. 
దర్శకుడు శ్రీహర్ష మాట్లాడుతూ.. అందరి సపోర్ట్ తో విడుదలవరకు వచ్చింది ఈ సినిమా. ప్రొడ్యూసర్ ఫణి లేకపోతే ఈ సినిమానే లేదు. నాకూ ఈ అవకాశం వచ్చేది కాదు. మ్యూజిక్, కెమెరా ఇలా అన్నీ మా చిత్రంలో హైలెట్. ఇక స్టోరీ అయితే రెండు గంటల పాటు పూర్తిగా ఎంటర్టైన్ చేస్తుంది. చిన్న సినిమా అనేది పేరుకే కానీ చాలా బిగ్ కాస్టింగ్ ఉంది. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం అన్నారు. 
హీరో ఇంద్ర మాట్లాడుతూ... ఒక సంవత్సరం క్రితం ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాము. పూరి జగన్నాధ్, బి. గోపాల్, ఓంకార్, రాంగోపాల్ వర్మ, బాబీ గారు ఇలా ఏంతో మంది ప్రముఖులు మా సినిమాకు  సపోర్ట్ అందించారు. పెళ్లి చూపులు సినిమా ఏరేంజ్ అవకాశాలను తెచ్చిపెట్టిందో అలానే ఈ మా సినిమాలో నటించిన అందరికీ అంతే రేంజ్ పేరును తీసుకువస్తుందని చెప్పగలను. దర్శకుడు శ్రీహర్ష మల్టీ వర్క్స్ అందించారు.  నిర్మాతగా ఫణి గారు చాలా  సపోర్ట్ అందించారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో ఈ 27న వస్తున్నాం ఆదరించండని అన్నారు.   
హీరోయిన్ సుకృత, మధుమని, సన్నీ, ఫణి బసంత్, మురుగన్ గోపాల్, గ్యారీజ్, సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.