రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన రామ్

Published on Oct 31,2019 03:45 PM

హీరో రామ్ తన కొత్త సినిమా ప్రారంభించడమే కాకుండా ఏకంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న చిత్రం '' రెడ్ '' . ఈ సినిమా నిన్న ప్రారంభమైంది అయితే వెంటనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు. ఇంతకీ ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడో తెలుసా ? ఏప్రిల్ 9 , 2020 న రెడ్ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నిన్న ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది కానీ సెట్స్ మీదకు వెళ్ళేది మాత్రం నవంబర్ 16 నుండి. చక చకా షూటింగ్ పూర్తిచేసి వేసవి సెలవులను వాడుకోవాలని చూస్తున్నారు. ఇంతకుముందు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన నేను శైలజ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.