రామ్, పూరిజగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్' చిత్ర షూటింగ్ ప్రారంభం

Published on Jan 24,2019 05:03 PM

ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమయ్యింది..'డబుల్ ధమాకా దిమాక్ ' అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ ఈ సినిమా లో కనిపించనున్నారు. కాస్ట్యూమ్స్ కూడా రామ్ పాత్ర కు తగినవిధంగా వైవిధ్యంగా ఉండడం విశేషం.. ఈ లాంగ్ షెడ్యూల్ లో హీరో రామ్ పై పలు ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా  రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

నటీనటులు : రామ్ పోతినేని, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి.. 

సాంకేతిక నిపుణులు : 

దర్శకుడు: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్

సమర్పణ: లావణ్య

బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్

సంగీతం: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్

ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి 

పాటల రచయిత: భాస్కరభట్ల

ఫైట్స్ : రియల్ సతీష్