రామ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం

Published on Oct 30,2019 11:14 AM
యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు రెడ్ చిత్రంలో. నేను శైలజ , ఉన్నది ఒకటే జిందగీ వంటి హిట్ చిత్రాలను రామ్ కు అందించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ రెడ్ చిత్రం రూపొందనుంది. రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు హిట్ కావడంతో ఈ రెడ్ చిత్రంపై అంచనాలు పెరిగాయి. పైగా ఇందులో తొలిసారిగా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు రామ్.

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు రామ్ దాంతో మరింత జోష్ తో ఉన్నాడు. తనకు ఊర మాస్ లాంటి చిత్రం పడటంతో అదే తరహాలో పాటుగా మరో అమాయక పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు రామ్. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మాళవిక శర్మ ని ఎంపిక చేశారు , మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది.