హీరోయిన్ కాళ్ళు మొక్కిన రాంగోపాల్ వర్మ

Published on Dec 30,2019 05:24 PM

దర్శకులు రాంగోపాల్ వర్మ హీరోయిన్ నైనా గంగూలీ కాళ్ళు మొక్కి సంచలనం సృష్టించాడు. బ్యూటీఫుల్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది నైనా గంగూలీ. ఈ భామ అందాలకు ఫిదా అయ్యాడు దర్శకులు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే వర్మ నైనా గంగూలీతో కలిసి డ్యాన్స్ చేసి రచ్చ చేసిన వర్మ తాజాగా నైనా గంగూలీ కాళ్ళ పై పడి అందరినీ షాక్ అయ్యేలా చేసాడు. సడెన్ గా వర్మ తన కాళ్ళను పట్టుకోవడంతో ఒకింత షాక్ అయిన నైనా గంగూలీ ఆ తర్వాత తేరుకొని కింద కూర్చుండిపోయింది.

వర్మ ఇలా కాళ్ళు మొక్కడం సంచలనంగా మారింది. సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నాడు వర్మ. అలాగే వోడ్కా తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియడం లేదు పాపం ఇతడికి. నిన్న ఫుల్లుగా వోడ్కా తాగిన వర్మ ఆ మత్తులో ఇలా చేసి సంచలనం సృష్టించాడు. నైనా గంగూలీ కాళ్ళు మొక్కుతున్న వర్మ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ బ్యూటీఫుల్ చిత్రం జనవరి 1 న విడుదల అవుతోంది.