రాంగోపాల్ వర్మ కొత్త చిత్రం దిశ

Published on Feb 01,2020 07:07 PM

యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన దిశ. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా తన కొత్త సినిమాని ప్రకటించాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ. ఇక ఈ సినిమా పేరు కూడా దిశ అనే పెట్టాడు వర్మ. జరుగుతున్న సంఘటనల ఆధారంగా చిత్రాలను ప్రకటించడం , తీయడం వర్మకు అలవాటే! అయినా వర్మ బోలెడు చిత్రాలు ఇలాగే తీసాడు అయితే వాటిలో ఒకటి అరా తప్ప మిగతా సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి మరి.

దిశ పై అత్యాచారం , హత్య దేశ వ్యాప్తంగా అందరినీ కలిచి వేసింది. ముఖ్యంగా దిశ పై అత్యాచారం జరగకముందు తన చెల్లి తో ఫోన్ లో మాట్లాడిన తీరుతో విపరీతమైన సానుభూతి ఏర్పడింది. దిశ  హంతకులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో రగిలిన ఆగ్రహావేశాలు చల్లరాయి ప్రజల్లో. కట్ చేస్తే ఇప్పుడు అదే కథాంశంతో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు వర్మ. ఈ సినిమానైనా సరిగ్గా తీస్తాడో ? లేక క్యాష్ చేసుకునే రకమో ! విడుదల అయితే కానీ తెలీదు.