వర్మపై బయోపిక్ పేరేంటో తెలుసా ?

Published on Nov 01,2019 05:26 PM

ఇన్నాళ్లు రాంగోపాల్ వర్మ ఇతరుల జీవితాలపై సినిమాలు తీసి సొమ్ము చేసుకున్నాడు కాగా ఇన్నాళ్లకు రాంగోపాల్ వర్మ పై బయోపిక్ తీయడానికి పూనుకున్నాడు ప్రముఖగేయ రచయిత జొన్నవిత్తుల. ఇంతకీ వర్మ బయోపిక్ టైటిల్ ఏంటో తెలుసా ....... '' పప్పు వర్మ ''. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పప్పు వర్మ అనే టైటిల్ తో సినిమా తీస్తానని శపథం చేసాడు జొన్నవిత్తుల.

కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే చిత్రం వర్మ తీస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆసినిమా ట్రైలర్ వివాదాన్ని సృష్టించడంతో ఓ ఛానల్ లో డిబేట్ జరిగింది. అయితే ఆ డిబేట్ లో పాల్గొన్న వర్మ జొన్నవిత్తుల పై కామెంట్ చేయడంతో రగిలిపోయిన జొన్నవిత్తుల వర్మ పై పప్పు వర్మ అని బయోపిక్ తీస్తానని ఛాలెంజ్ చేసాడు. మరి ఇది సెట్స్ మీదకు వెళ్తుందో లేక ఆవేశంలో అన్నాడో చూడాలి.