చిరంజీవితో కలిసి నటించాలని ఆశపడుతున్న చరణ్

Published on Nov 12,2019 04:14 PM

తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించాలని ఆశపడుతున్నాడు తనయుడు రాంచరణ్ తేజ్. మంచి కథ దొరికితే , ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా మేమిద్దరం కలిసి నటిస్తాం అయితే ముందే మేము కలిసి నటిస్తామని చెప్పి ఆశపడి తీరా సమయానికి నటించకపోతే అదో పెద్ద వెలితి అందుకే ఎక్కువగా ఆలోచించడం లేదని అంటున్నాడు చరణ్.

చరణ్ నటించిన మగధీర , బ్రూస్ లీ చిత్రాల్లో  చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తాడు. ఇక చరణ్ కూడా తండ్రి తో కలిసి ఖైదీ నెంబర్ 150 చిత్రంలో స్టెప్స్ వేసి మెప్పించాడు. అయితే అవి కేవలం గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే ! అలా కాకుండా పూర్తి నిడివి పాత్రల్లో ఈ ఇద్దరినీ చూసుకుంటే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు. అదే చరణ్ ఆశ కూడా.