ఆ సినిమా చేయడం లేదని చెప్పిన రాంచరణ్

Published on Oct 27,2019 11:55 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నాన్న చిరంజీవి పాత్రలో నటించడం లేదని తేల్చి చెప్పాడు. తెలుగునాట బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. దాంతో చిరంజీవి బయోపిక్ కూడా తెరపైకి వస్తోంది. అయితే చిరంజీవి బయోపిక్ కనుక తీస్తే అందులో చిరంజీవి పాత్రని రాంచరణ్ చేస్తే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో ఈ విషయం చరణ్ చెవిన పడటంతో ఆ సాహసం నేను చేయలేను అంటూ తేల్చి చెప్పాడు.
            అంతేకాదు సైరా నరసింహారెడ్డి చిత్రంలో క్లైమాక్స్ లో నాన్నగారి తల తీసే సన్నివేశంని జీర్ణించుకోలేకపోయాను నేనైతే కన్నీళ్ల పర్యంతం అయ్యాను. అయితే ఆ సీన్ చేయడానికి 2 నెలల పాటు ఆలోచించామని అంటున్నాడు చరణ్. మొత్తానికి సైరా నరసింహారెడ్డి తెలుగులో భారీ విజయాన్ని సాధించినప్పటికీ మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో వసూళ్ళని సాధించలేకపోయింది.