నాగార్జునతో రొమాన్స్ చేయనున్న రకుల్

Published on Feb 27,2019 02:39 PM

సీనియర్ హీరో నాగార్జున తో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ . ఈ భామకు టాలీవుడ్ లో సరైన హిట్స్ లేకుండాపోయాయి దాంతో చేతిలో సినిమాలు లేవు . ఇంకేముంది డిమాండ్ అంతగా లేకపోవడంతో చివరకు సీనియర్ హీరో నాగార్జున తో నటించడానికి ఒప్పుకుంది రకుల్ . అన్నపూర్ణ బ్యానర్ లో ఇంతకుముందు రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలో చేసింది కాకపోతే హీరో నాగచైతన్య . 

ఇపుడు మరోసారి అన్నపూర్ణ బ్యానర్ లో నటించడానికి సిద్ధం అవుతోంది . అయితే హీరో మారాడు నాగార్జున . మన్మథుడు చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 చేస్తున్నారు . ఇద్దరు హీరోయిన్ లు కాగా ఇప్పటికే హాట్ భామ పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేయగా ఇప్పుడేమో రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసారు .