విజయ్ దేవరకొండని రిజెక్ట్ చేసిన రకుల్

Published on Nov 23,2019 07:15 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ వస్తే వదులుకొని సూపర్ హిట్ చిత్రాన్ని చేజార్చుకుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఇంతకీ రకుల్ మిస్ చేసుకున్న సినిమా ఏంటో తెలుసా ...... గీత గోవిందం. విజయ్ దేవరకొండ కు అప్పట్లో ఓ మోస్తరు క్రేజ్ మాత్రమే ఉంది అలాంటి సమయంలో గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ రకుల్ ప్రీత్ సింగ్ కు వచ్చిందట.

అయితే అదే సమయంలో హిందీలో మంచి ఆఫర్ ఉండటంతో విజయ్ దేవరకొండ సినిమాని రిజెక్ట్ చేసింది. దాంతో రకుల్ కు బదులుగా కన్నడ భామ రష్మిక మందన్న ని తీసుకున్నారు కట్ చేస్తే గీత గోవిందం ఎంత పెద్ద హిట్ అయిందో రష్మిక మందన్న కు ఎంత మంచి పేరు వచ్చిందో తెలిసిందే కదా ! అలా విజయ్ సినిమాని రిజెక్ట్ చేసి ఇప్పుడు బాధపడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనంటోంది.