దేశం కోసం ప్రాణమిస్తానంటున్న రాఖీ సావంత్

Published on Mar 01,2019 04:36 PM

హాట్ బాంబ్ రాఖీ సావంత్ దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించింది . తాజాగా ఈ భామ పంజాబ్ లో పర్యటించింది . ఆ సందర్బంగా మాట్లాడిన రాఖీ సావంత్ భారత్ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించడమే కాకుండా బాంబ్ లను పట్టుకొని పాక్ వెళ్తానని , పాక్ శిభిరంలో 100 బాంబ్ లను పేల్చి వేస్తానని ఆవేశంతో ఊగిపోయింది . 

భారత్ - పాక్ ల మధ్య గతకొంత కాలంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ పాక్ కు గట్టి బుద్ది చెప్పింది . పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టింది . ఇక రాఖీ సావంత్ విషయానికి వస్తే నిత్యం ఏదో ఒక వివాదాన్ని రాజేసే ఈ భామ తాజా సంఘటనని తన కు అనువుగా మలచుకుంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది అదీ విషయం .