రాజ్ తరుణ్ కారు ప్రమాదంపై హైడ్రామా

Published on Aug 22,2019 03:30 PM

హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది అయితే ఆ ప్రమాదం నుండి రాజ్ తరుణ్ బయటపడ్డాడు కానీ మీడియాలో వార్తలు రావడంతో అబ్బే ! నా కారుకి ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు ...... నేను ఇంట్లో నుండి అసలు బయటకే రాలేదు అని స్టేట్ మెంట్ ఇచ్చి డ్రామా నడిపించాడు . దాంతో కొంతమంది ఛానల్ వాళ్ళు అదేపనిగా రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ తర్వాత పరుగెత్తుకుంటూ వెళ్లిపోతున్న విజువల్స్ ప్రసారం చేయడంతో యాక్సిడెంట్ జరిగింది కానీ ..... అంటూ అసలు విషయాన్నీ ఒప్పుకున్నాడు . 

అయితే ఒకరోజంతా హైడ్రామా నడిపించి ఆ తర్వాత ఒప్పుకున్నాడు . నార్సింగ్ సర్కిల్లో రాజ్ తరుణ్ కారు బలంగా గుద్దుకోవడంతో కారు దెబ్బతింది . అయితే సడెన్ టర్న్ కావడంతో షాక్ అయిన రాజ్ తరుణ్ ఏమి చేయాలో పాలుపోక అక్కడి నుండి పారిపోయాడు . ఆ తర్వాత హైడ్రామా తర్వాత ఒప్పుకున్నాడు .