రాజ్ తరుణ్ అరెస్ట్ విడుదల

Published on Aug 24,2019 11:15 AM
యంగ్ హీరో రాజ్ తరుణ్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు , అయితే అరెస్ట్ చేసిన వెంటనే స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసారు . ఇంతకీ రాజ్ తరుణ్ అరెస్ట్ కావడం ఏంటి ? విడుదల కావడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? నార్సింగ్ సర్కిల్ లో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే . కారు యాక్సిడెంట్ కేసులో రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతడికి నోటీసులు అందించారు . 

మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి , స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసారు . అయితే సోమవారం రోజున కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు . పోలీసులు ఇచ్చిన నోటీసులు అందుకున్న రాజ్ తరుణ్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు . కార్ యాక్సిడెంట్ కేసులో రాజ్ తరుణ్ అల్లరి పాలయ్యాడు .