కొత్త సినిమా స్టార్ట్ చేసిన రజనీకాంత్

Published on Dec 12,2019 12:24 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈవయసులో కూడా అలుపెరుగకుండా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా నిన్న చెన్నై లో కొత్త సినిమా మొదలు పెట్టాడు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ చిత్రం అంగరంగ వైభవంగా చెన్నై లో ప్రారంభమైంది. ఈ ప్రారంభ వేడుకకు రజనీకాంత్ , కుష్భు , మీనా లతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సీనియర్ హీరోయిన్ లు మీనా , కుష్భు లు ఈ చిత్రంలో నటిస్తున్నారు అయితే వాళ్ళు పోషిస్తున్న క్యారెక్టర్ లు ఏంటి ? అన్నది తేలాల్సి ఉంది. మీనా మాత్రం నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది అయితే నెగెటివ్ రోల్ కు మీనా కంటే కుష్బూ కరెక్ట్ కానీ దర్శకుడి వ్యూహం ఎలా ఉందో మరి.

ఇక ఈ సినిమాని పక్కన పెడితే తాజాగా దర్బార్ అనే చిత్రంలో నటించాడు రజనీకాంత్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ చిత్రం జనవరి 9 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దర్బార్ లో రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇక రజనీ సరసన నయనతార నటిస్తోంది. గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రజనీకాంత్ కు దర్బార్ విజయం తప్పనిసరి. భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ ని మాత్రం ఇవ్వలేకపొతున్నాడు. ఆ లోటుని దర్బార్ తీరుస్తుందో చూడాలి.