ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్న రజనీకాంత్

Published on Mar 10,2020 08:27 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కో సమయంలో ఒక్కోలా మాట్లాడుతూ తన అభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నానని చెబుతున్నాడు అలాగే రాజకీయాలు నాకు సరిపడవు , సినిమాలు చేసుకుంటాను అంతకుమించి ఏమొద్దు అని తాజాగా స్టేట్ మెంట్ ఇచ్చాడు రజనీకాంత్. దాంతో షాక్ అవ్వడం అభిమానుల వంతు అయ్యింది. రాజకీయాలు వద్దు సినిమాలు చేసుకుంటాను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు రజనీకాంత్.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయ పార్టీ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు అలాగే తన అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నాడు కూడా. దాంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని భావిస్తున్నారు అభిమానులు. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నాకు రాజకీయాలు వద్దు సినిమాలు చాలు అనే స్టేట్ మెంట్ తో షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.