70 ఏళ్ల వయసులో తన సీక్రెట్ బయటపెట్టిన రజనీకాంత్

Published on Jan 04,2020 03:21 PM
నాకు 70 ఏళ్ల వయసు , ఈ వయసులో కూడా సంతోషంగా ఉన్నానంటే అందుకు కారణం ఏంటో తెలుసా ....... ఎక్కువగా ఆలోచించకుండా , తక్కువగా ఆలోచించడమే ! అంతేకాదు ఎక్కువగా ఆశపడొద్దు ..... తక్కువగా ఆశ పడటం వల్ల నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉండదు అప్పుడే మానసికంగా ప్రశాంతంగా ఉంటామంటూ తన అభిమానులకు సలహా ఇచ్చాడు రజనీకాంత్. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది , ఆ వేడుకకు రజనీకాంత్ తో పాటుగా భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.

ఆ వేడుకలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ తక్కువగా తిని , తక్కవగా నిద్ర పోయి , తక్కువగా ఆశపడటం వల్లే 70 ఏళ్ల వయసులో కూడా సంతోషంగా ఉన్నానని అందుకు మీ ఆధారాభిమానాలే కారణం అంటూ సంతోషాన్ని వెలిబుచ్చాడు రజనీకాంత్. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ ఈనెల 9 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని తిరుపతి ప్రసాద్ అందిస్తుండటం విశేషం.