అమితాబ్ సలహాని తిరస్కరించిన రజనీకాంత్

Published on Dec 18,2019 10:01 PM

అమితాబ్ బచ్చన్ అంటే నాకు ఎంతో ఇష్టం , గౌరవం కానీ ఆయన ఇచ్చిన సలహా మాత్రం పాటించలేకపోతున్నానని , ఆయన సలహా తిరస్కరిస్తున్నానని స్పష్టం చేసాడు రజనీకాంత్. ఇంతకీ అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ కు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా ....... రాజకీయాల్లోకి రావద్దు అని. రాజకీయాల్లోకి అమితాబ్ మాత్రమే కాదు చాలామంది నటీనటులు వచ్చారు కానీ అందులో సక్సెస్ అయ్యింది మాత్రం ఎంజీఆర్ , ఎన్టీఆర్ , జయలలిత , కరుణానిధి మాత్రమే ! ఇక వీళ్ళు తప్ప దేశ వ్యాప్తంగా చాలామంది హీరోలు , హీరోయిన్ లు , ఇతర నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఆటలో అరటిపండులా మాత్రమే అయ్యారు.

అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు. రాజీవ్ గాంధీ మీద ఉన్న అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చాడు అమితాబ్ . ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. అయితే ఆ తర్వాత ఓడిపోయాడు అంతేకాదు రాజకీయాల్లో రాణించలేకపోయాడు. తెరమీద హీరోలం కానీ రాజకీయాల్లో కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు అని అమితాబ్ సలహా ఇస్తున్నాడు. కానీ అతడి సలహా మాత్రం పక్కన పెట్టాడు రజనీకాంత్. నేను రాజకీయాల్లోకి వస్తున్నానని మరోసారి స్పష్టం చేసాడు రజనీకాంత్.