విజయ్ అభిమానిని చంపిన రజనీకాంత్ అభిమాని

Published on Apr 26,2020 04:22 PM
హీరో విజయ్ అభిమానిని రజనీకాంత్ అభిమాని చంపిన సంఘటన తమిళనాట సంచలనం సృష్టించింది. యువరాజ్ ఇళయదళపతి విజయ్ వీరాభిమాని, దినేష్ బాబు సూపర్ స్టార్ రజనీకాంత్ కు వీరాభిమాని. దినేష్ - యువరాజ్ ఇద్దరు కూడా స్నేహితులు . అయితే హీరోల పరంగా వస్తే మాత్రం తీవ్ర పోటీ ఉండేదట ఈ ఇద్దరికీ. ఇక కరోనా మహామ్మారి వల్ల తమిళ హీరోలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు.

అయితే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఈ ఇద్దరూ గొడవపడ్డారు. ఆ గొడవ పెద్దది అయి ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఆ తోపులాటలో విజయ్ అభిమాని యువరాజ్ కిందపడ్డాడు , కిందపడిన సమయంలో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దాంతో రజనీకాంత్ అభిమాని దినేష్ ని అరెస్ట్ చేసారు పోలీసులు. హీరోని అభిమానించవచ్చు కానీ ఇలా మరొక హీరో అభిమానితో గొడవలు పడితే జరిగేది ఇదే అని పలు సంఘటనలు రుజువు చేసాయి. ఇప్పుడు ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది తమిళనాట.