196 కోట్ల బిజినెస్ తో సంచలనం సృష్టించిన రజనీకాంత్

Published on Jan 08,2020 05:39 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం రేపు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు ఎంత బిజినెస్ జరిగిందో తెలుసా ........ 196 కోట్లు. అవును వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 196 కోట్ల బిజినెస్ జరిగింది. రజనీకాంత్ నటించిన చిత్రాలు గతకొన్నాళ్ళుగా ప్లాప్ అవుతున్నప్పటికీ దర్బార్ చిత్రానికి దాదాపు 200 కోట్ల బిజినెస్ జరగడం సంచలనంగా మారింది. ఇందుకు కారణం రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం ఒక కారణమైతే ఏ ఆర్ మురుగదాస్ దర్శకుడు కావడం మరో కారణం.

ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించగా తెలుగులో మాత్రం ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని అందిస్తున్నాడు. ఓవర్ సీస్ , తెలుగు , తమిళ్ , కర్ణాటక , కేరళ , శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , ఆడియో రైట్స్ రూపంలో మొత్తంగా 196 కోట్ల బిజినెస్ జరిగింది. థియేట్రికల్ బిజినెస్ మాత్రం 133 కోట్లకు జరిగింది. అంటే దర్బార్ 135 కోట్ల షేర్ రాబట్టాలన్న మాట ప్రపంచ వ్యాప్తంగా. రజనీకాంత్ సరసన నయనతార నటించగా నివేదా థామస్ కీలక పాత్రలో నటించింది. ఇక విలన్ గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటించాడు. రేపే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది దర్బార్.