చిన్నారి మరణంతో కుంగిపోయిన రజనీకాంత్

Published on Oct 30,2019 11:19 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ చిన్నారి మరణంతో కుంగిపోయాడు. బోరు బావిలో పడిన చిన్నారి సుర్జీత్ విల్సన్ ఎలాగైనా ప్రాణాలతో బయటకు వస్తాడని ఆశించారు రజనీకాంత్ అయితే దాదాపు 80 గంటల తర్వాత ఆ చిన్నారి సుర్జీత్ విగతజీవిగా పైకి రావడంతో తీవ్రంగా బాధపడ్డారు రజనీకాంత్ దాంతో ఆ చిన్నారి తల్లిదండ్రులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు రజనీ .

దేశ వ్యాప్తంగా బోరు బావులలో పెద్ద ఎత్తున చిన్నారులు పడుతున్నారు అయితే అందులోంచి క్షేమంగా బయటపడుతున్న వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు మిగతా వాళ్ళు అసువులు బాస్తున్నారు. ఎప్పటికప్పుడు బోరు బావుల సంఘటనలు ప్రజలను , సెలబ్రిటీలను కలిచి వేస్తున్నప్పటికీ , ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతమౌతూనే ఉన్నాయి.