రజనీకాంత్ దర్బార్ విడుదల ఎప్పుడో తెలుసా

Published on Nov 19,2019 09:57 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దర్బార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని జనవరి 15 న విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు విడుదల తేదీ మారింది. ఇంతకీ దర్బార్ విడుదల అయ్యేది ఎప్పుడో తెలుసా ........ జనవరి 9 న.

అవును 2020 జనవరి 9 న దర్బార్ చిత్రం విడుదల కానుంది. ఈ విషయాన్నీ లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది కొద్దిసేపటి క్రితం. జనవరి 12 న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు , అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రాలు విడుదల అవుతున్న నేపథ్యంలో మూడు రోజుల ముందుగా విడుదల చేయడం వల్ల భారీ ఓపెనింగ్స్ సాధించవచ్చని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. రజనీకాంత్ స్టిల్స్ చూస్తుంటే తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టే లాగే కనబడుతున్నాడు. చాలాకాలంగా రజనీకాంత్ కు సరైన హిట్ లేకుండాపోయింది ఆ లోటుని దర్బార్ తీర్చేలా కనబడుతోంది.