పెళ్లికి రెడీ అవుతున్న రజనీకాంత్ కూతురు

Published on Feb 05,2019 12:53 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ రెండో పెళ్ళికి రెడీ అయ్యింది . ఈనెల 9 నుండి 11 వరకు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి . ఫిబ్రవరి 11న విశాగన్ ని పెళ్లి చేసుకోనుంది సౌందర్య రజనీకాంత్ . సౌందర్య కు ఇది రెండో పెళ్లి కాగా నటుడు , వ్యాపారవేత్త అయిన విశాగన్ కు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం . 

నేను పెళ్లి కూతురు అయ్యానని , మరో వారం రోజులోనే నా పెళ్లి అంటూ ట్వీట్ చేసింది సౌందర్య రజనీకాంత్ . సౌందర్య రజనీకాంత్ చిన్న కూతురు అన్న విషయం తెలిసిందే . అశ్విన్ కుమార్ ని 2010 లో పెళ్లి చేసుకుంది సౌందర్య వాళ్లకు ఒక బాబు కూడా అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2016 లో విడాకులు తీసుకున్నారు . సౌందర్య రజనీకాంత్ కొచ్చాడైయాన్ , వి ఐ పి 2 అనే   రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది కూడా కానీ ఆ రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి .