ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ సోదరుడు

Published on Aug 29,2019 10:56 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు  గైక్వాడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, మోకాలి గాయంతో బాధపడుతున్న సత్యనారాయణరావు గైక్వాడ్ బెంగుళూర్ లోని అపోలో ఆసుపత్రిలో మోకాలి కి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు దాంతో సోదరుడిని పరామర్శించడానికి చెన్నై నుండి బెంగుళూర్ వెళ్ళాడు రజనీకాంత్. 

రజనీకాంత్ వచ్చిన విషయం క్షణాల్లో తెలియడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు అభిమానులు , ప్రజలు. బెంగుళూర్ లోని అపోలో ఆసుపత్రికి చేరుకున్న రజనీకాంత్ సోదరుడిని పరామర్శించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఇక డాక్టర్లతో పాటుగా అభిమానులు కూడా రజనీకాంత్ తో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. రజనీకాంత్ చెన్నై లో స్థిరపడగా సోదరుడు మాత్రం బెంగుళూర్ లో స్థిరపడ్డాడు.