వైరల్ అవుతున్న రజనీకాంత్ లుక్

Published on Oct 27,2019 03:24 PM

ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దర్బార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా దీపావళి సందర్భాన్ని పురస్కరించుకొని దర్బార్ చిత్రంలో పోలీస్ గెటప్ లో ఉన్న రజనీకాంత్ లుక్ ని విడుదల చేసారు. ఈ లుక్ లో రజనీకాంత్ అదరగొట్టాడు దాంతో రజనీ లుక్ వైరల్ అవుతోంది. చాలాకాలం తర్వాత రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

ఇక ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండటంతో దర్బార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ సరసన నయనతార నటిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ రజనీకాంత్ అన్న విషయం తెలిసిందే. 69 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్ తనదైన స్టైల్ తో అదరగొడుతున్నాడు.