సైరా కు గెస్ట్ గా రజనీకాంత్

Published on Aug 26,2019 02:38 PM

సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ నెలాఖరున భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా ఆ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అథితిగా హాజరు కానున్నట్లు జరుగుతోంది. చిరంజీవి - రజనీకాంత్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ పైగా ఒకేసారి స్టార్ డం ని పొందిన వాళ్ళు సమకాలీకులు దాంతో రజనీకాంత్ ని ఈ  వేడుకకు చీఫ్ గెస్ట్ గా పిలవాలని అనుకుంటున్నాడట చిరు. 
అమితాబ్ బచ్చన్ , నయనతార ,విజయ్ సేతుపతి , జగపతిబాబు , సుదీప్ , తమన్నా , నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లోనే చిరస్థాయిగా ఈ చిత్రం నిలిచిపోతుందని భావిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2 న భారీ ఎత్తున విడుదల కానుంది. అందుకే సెప్టెంబర్ లో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారట చరణ్ అండ్ కో.