18 ఏళ్ల క్రితం ఫోటో ట్వీట్ చేసిన రాజమౌళి

Published on Sep 28,2019 10:15 AM

దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి 18 ఏళ్ల క్రితం నాటి ఫోటో ని ట్వీట్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తాడు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం రాజమౌళి దర్శకుడిగా పరిచయమైన చిత్రం స్టూడెంట్ నెం 1.  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు ఆ చిత్రంలో అయితే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు సింహాద్రి లో కూడా లావుగా ఉన్నాడు దాంతో నీకు లేడీ ఫ్యాన్స్ , ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కావాలంటే లావు తగ్గాల్సిందే అని గట్టిగా చెప్పాడట.
దాంతో జూనియర్ ఎన్టీఆర్ కఠోర శ్రమ చేసి లావు తగ్గాడు , చాలా సన్నమయ్యాడు. స్టూడెంట్ నెం 1 బ్లాక్ బస్టర్ అయ్యింది , ఆ తర్వాత సింహాద్రి కూడా రికార్డులు తిరగరాసింది. యమదొంగ సూపర్ హిట్ అయ్యింది కట్ చేస్తే 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తో ఆర్ ఆర్ ఆర్ అనే చిత్రానికి శ్రీకారం చుట్టాడు జక్కన్న. దాంతో 18 ఏళ్ల క్రితం ఫోటోని అలాగే ఇప్పటి ఫోటోని రెండు కూడా షేర్ చేసాడు రాజమౌళి.