భయపడుతున్న రాజమౌళి

Published on Dec 23,2019 09:22 AM

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన అన్నయ్య కొడుకులు సక్సెస్ అవుతారో ? లేదో అని భయపడుతున్నాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ఓటమి అన్నది తెలియని రాజమౌళి ఇంతగా ఇప్పుడే ఎందుకు భయపడుతున్నాడో తెలుసా ....... అన్నయ్య ఎం ఎం కీరవాణి కొడుకులు ఇద్దరు కూడా సినిమారంగంలో అడుగుపెడుతున్నారు మత్తు వదలరా అనే సినిమాతో. ఈనెల 25న మత్తు వదలరా చిత్రం విడుదల అవుతోంది. దాంతో నిన్న హైదరాబాద్ లో మత్తు వదలరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కాగా ఆ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి.

కీరవాణి కొడుకులు శ్రీ సింహా హీరోగా , కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దాంతో ఈ ఇద్దరూ హిట్ కొడితే పర్లేదు కానీ ఏమాత్రం తేడా వచ్చినా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. అందుకే జక్కన్న భయపడుతున్నాడట. అన్నయ్య కొడుకులు విజయం సాధిస్తే తప్పకుండా పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తాయి అయితే రివర్స్ అయితే మాత్రం చిన్న బోవాల్సి వస్తుంది కాబట్టి విపరీతమైన టెన్షన్ పడుతున్నారట టోటల్ కీరవాణి కుటుంబం. ఈనెల 25 న మత్తు వదలరా సినిమా విడుదలైతే కానీ తెలీదు వారసుల సంగతి ఏంటి ? అన్నది.