పవన్ కళ్యాణ్ తో సినిమా కుదరదంటున్న రాజమౌళి

Published on Apr 22,2020 04:17 PM
పవన్ కళ్యాణ్ తో నేను సినిమా చేయాలనీ గతంలో అనుకున్నాం కానీ కుదరలేదు , ఇకపై ముందు కూడా పవన్ తో సినిమా చేయడం కుదరదు అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. కరోనా వైరస్ తో సెలవులు దక్కడంతో ఇంట్లోనే ఉంటున్న జక్కన్న మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు అని ప్రశ్నించినప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా ఇక కుదరని పని నాకు అతడికి సెట్ కాదు ఎందుకంటే నేను ఏళ్ల తరబడి సినిమా చేస్తాను ఆయనేమో త్వరగా చేయాలంటారు అని వివరించాడు రాజమౌళి.

అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి సేవ చేస్తున్నాడని , ఆయనకు వందకు వంద మార్కులు వేయచ్చు కానీ నేను అలా చేయడం లేదు కదా ! నాకు 5 మార్కులు వస్తే గొప్పే అని సామాజిక సేవ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తో నన్ను పోల్చద్దు అని చెప్పాడు రాజమౌళి. అంటే ఈ లెక్కన భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో రాజమౌళి సినిమా చేయడం కష్టమే అని తేలిపోయింది.