విజయంతో పొంగిపోతున్న కీరవాణి , రాజమౌళి

Published on Dec 26,2019 02:00 PM

ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి ఇద్దరు తనయులు శ్రీ సింహా , కాలభైరవ లు పనిచేసిన '' మత్తు వదలరా '' చిత్రం విజయం సాధించడంతో ఉప్పొంగిపోతున్నారు. కీరవాణి - రాజమౌళి కుటుంబంలో చాలామంది రకరకాల విభాగాలలో పనిచేసారు అయితే హీరోగా మాత్రం ఆ కుటుంబం నుండి ఎవరూ లేరు ఆ లోటుని భర్తీ చేసాడు శ్రీ సింహా. తండ్రి కీరవాణికి , బాబాయ్ ఎస్ ఎస్ రాజమౌళికి చెప్పకుండా మత్తు వదలరా అనే సినిమాని చేశారట శ్రీ సింహా , కాలభైరవ. అయితే సినిమా కొంత అయ్యాక మాత్రం చెప్పారట దాంతో వాళ్లకు లోలోన కాస్త భయంగానే ఉండేది సినిమా ఏమౌతుందో.....  ఏంటో ? అని.

అయితే నిన్న విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మల్టీప్లెక్స్ లలో సూపర్ హిట్ అవ్వడం ఖాయమని బిసి కేంద్రాల్లో మాత్రం ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేమని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా చాలా బాగుందని టాక్ రావడంతో కీరవాణి - రాజమౌళి కుటుంబాల్లో టెన్షన్ పోయి పండగ వాతావరణం నెలకొంది. తమ వారసులు విజయం సాధించడంతో విజయగర్వంతో పొంగిపోతున్నారు. శ్రీ సింహా హీరోగా అద్భుతంగా నటించగా కాలభైరవ సంగీత దర్శకుడిగా రాణించాడు. ఇద్దరు వారసులు కూడా విజయాన్ని ఒకేసారి సాధించడంతో కీరవాణి దంపతులు పుత్రోత్సాహంతో పరవశించిపోతున్నారు.