దిల్ రాజుని దెబ్బకొట్టిన రాజ్ తరుణ్

Published on Dec 30,2019 02:28 PM
అగ్ర నిర్మాత దిల్ రాజుని దెబ్బ కొట్టాడు హీరో రాజ్ తరుణ్. ఒక్కసారి కాదు ఏకంగా రెండుసార్లు దిల్ రాజు కు గట్టి దెబ్బలు తగిలాయి రాజ్ తరుణ్ వల్ల. దిల్ రాజుని రాజ్ తరుణ్ దెబ్బ కొట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇటీవల రాజ్ తరుణ్ - షాలిని పాండే జంటగా నటించిన ఇద్దరి లోకం ఒకటే చిత్రం విడుదల అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు ఈ సినిమాకు. ఇద్దరి లోకం ఒకటే తప్పకుండా హిట్ అవుతుందని దిల్ రాజుతో పాటుగా రాజ్ తరుణ్ కూడా భావించాడు కానీ వీళ్ళ అంచనాలను తల్లకిందులు చేస్తూ సినిమా దారుణమైన ఫలితాన్ని పొందింది.

ఇక ఈ సినిమాని పక్కన పెడితే అంతకుముందు ఇదే రాజ్ తరుణ్ హీరోగా లవర్ అనే చిత్రాన్ని నిర్మించాడు దిల్ రాజు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దిల్ రాజు బ్యానర్ అంటే అంచనాలు ఉంటాయి కానీ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి లవర్ , ఇద్దరి లోకం ఒకటే చిత్రాలు. ఇక రాజ్ తరుణ్ సినిమా అంటే కూడా మినిమమ్ గ్యారెంటీ అనుకుంటారు కానీ రాజ్ తరుణ్ కూడా ఈ విషయంలో దారుణమైన పరాజయాలను మూటగట్టుకున్నాడు.