న్యాయం కావాలని కేటీఆర్ ని కోరిన రాహుల్

Published on Mar 08,2020 04:59 PM

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనపై దాడికి పాల్పడిన వాళ్ళని శిక్షించి నాకు న్యాయం చేయాలనీ కోరుతూ తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ని కోరాడు. గచ్చిబౌలి లోని ప్రిజం పబ్ లో రాహుల్ పై ఎం ఎల్ ఏ రోహిత్ రెడ్డి  సోదరుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే దాడి జరిగిన తర్వాత ఇంటికి వెళ్లిన రాహుల్ మధ్యాహ్నం పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ కు కూడా ట్వీట్ చేస్తూ నాకు న్యాయం కావాలి అంటూ కోరుతున్నాడు రాహుల్.

అయితే ఇంకా కేటీఆర్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. రాహుల్ సిప్లిగంజ్ కేటీఆర్ తో పాటుగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కూడా ట్యాగ్ చేసాడు. అయితే అటువైపు నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు ఇంకా. దాడి చేసింది అధికార పార్టీకి చెందిన ఎం ఎల్ ఏ కావడంతో కాబోలు ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అయితే కేటీఆర్ మాత్రం ఈ విషయం పై చాలా కోపంగా ఉన్నాడట. ఇలాంటి సంఘటనలు పార్టీ ఇమేజ్ ని ఇబ్బంది పెట్టేవి కావడంతో దానికి ఒక ముగింపు ఇవ్వాలని భావిస్తున్నాడట మంత్రి కేటీఆర్.