దాడిచేసిన వాళ్లతో రాజీపడనంటున్న రాహుల్

Published on Mar 06,2020 07:45 AM

తనపై దాడి చేసిన వాళ్లతో ఎప్పటికి రాజీపడేది లేదని స్పష్టం చేసాడు బిగ్ బాస్ 3 తెలుగు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. నిన్న రాత్రి గచ్చిబౌలి లోని ప్రిజం పబ్ లో రాహుల్ సిప్లిగంజ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో పాల్గొంది ఎం ఎల్ ఏ రోహిత్ రెడ్డి బంధువు కావడంతో గాయపడిన రాహుల్ పబ్ నుండి ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్న అనంతరం ఇంటికి వెళ్ళిపోయాడు.

అయితే మధ్యాహ్నం తర్వాత గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించిన రాహుల్ రోహిత్ రెడ్డి తో పాటుగా మరో నలుగురిపై కేసు పెట్టాడు. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది అందుకే కేసు పెట్టాను . ఇక వాళ్లతో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. తన స్నేహితురాళ్లను అసభ్య పదజాలంతో దూషించడంతో ఈ గొడవ జరిగిందని , గతంలో కూడా రోహిత్ రెడ్డి ఇలాంటి ఆగడాలకు పాల్పడ్డాడని అందుకే అతడితో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నాడు.