తమన్నా , మెహరీన్ ల తొడలపై సంచలన వ్యాఖ్యలు

Published on Mar 06,2019 02:33 PM

తమన్నా , మెహరీన్ ల తొడలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు . వెంకటేష్ - తమన్నా , వరుణ్ తేజ్ - మహరీన్ లు జంటగా నటించిన చిత్రం ఎఫ్ 2 . జనవరి 12న రిలీజ్ అయిన ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్ర యాభై రోజుల వేడుక ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది . కాగా ఆ వేడుకకు ముఖ్య అథితిగా రాఘవేంద్రరావు హాజరయ్యాడు .

అనిల్ రావిపూడి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు , ఇక తమన్నా , మెహరీన్ లు స్విమ్ సూట్ లో చాలా బాగున్నారు , హీరోయిన్ ల తొడలను చూడటానికి జనాలు ఎగబడ్డారు అందుకే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యిందని అన్నాడు . హీరోయిన్ లను గ్లామర్ గా చూపిస్తేనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారని అంటున్నాడు దర్శకేంద్రుడు . రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్ ల గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ అన్న విషయం తెలిసిందే .