కమల్ పోస్టర్ లపై పేడ వేశానంటున్న లారెన్స్

Published on Dec 09,2019 08:05 PM
నేను రజనీకాంత్ కు వీరాభిమానిని దాంతో కమల్ హాసన్ పోస్టర్ లపై పేడ వేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో దర్శక నిర్మాత రాఘవ లారెన్స్. నిన్న రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్ర ఆడియో వేడుక చెన్నై మహానగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున రజనీ అభిమానులు వచ్చారు ఇక లారెన్స్ కూడా గెస్ట్ గా హాజరయ్యాడు. రజనీకాంత్ పై తనకున్న అభిమానాన్ని చాటి చెప్పడానికి చిన్ననాటి సంఘటనలు చెప్పాడు లారెన్స్.

రజనీకాంత్ అంటే అభిమానం ఉండటంతో కమల్ హాసన్ నటించిన సినిమా పోస్టర్ లు వేసినప్పుడు పేడ వేసేవాడినని చెప్పాడు. లారెన్స్ వ్యాఖ్యలు కమల్ హాసన్ అభిమానులను తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యేలా చేస్తున్నాయి. వెంటనే కమల్ హాసన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ గొడవ పెద్దది ఎందుకని భావించిన లారెన్స్ క్షమాపణలు చెప్పాడు అయితే పేడ వేసింది ఇప్పుడు కాదు చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అంటూ వివరణ ఇచ్చాడు పాపం.