రాహుల్ కు వార్నింగ్ ఇచ్చిన పునర్నవి

Published on Nov 19,2019 10:40 PM

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కు వార్నింగ్ ఇచ్చింది పునర్నవి. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోకు రాహుల్ - పునర్నవి జంటగా హాజరయ్యారు. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న సమయంలో ప్రేమలో పడిన ఈ ఇద్దరూ మేము మంచి ఫ్రెండ్స్ అని అంటున్నారు కానీ ప్రేమికుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు దాంతో ఇద్దరి మధ్య జోరుగా ప్రేమ సాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక నిన్న రాత్రి అలీ షోలో పాల్గొన్నారు ఈ ఇద్దరూ. ఆ సమయంలో రాహుల్ మాట్లాడుతున్న చాలా సందర్భాల్లో రాహుల్ ని భయపెడుతూనే ఉంది పునర్నవి. తనకు కోపం చాలా ఎక్కువని అయితే ప్రస్తుతం తగ్గించుకుంటున్నానని చెబుతోంది. అయితే కోపం తగ్గించుకుంటున్నా అని చెబుతున్నప్పటికీ రాహుల్ మీద మాత్రం కోపం ప్రదర్శిస్తూనే ఉంది పునర్నవి. ఘాటు ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు పలువురు.